పది రోజుల్లోనే లాభాల బాట పట్టిన రాక్షసుడు

“అల్లుడు శీను”తో కెరీర్ ను ప్రారంభించిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మారి అయిదేళ్లు పూర్తైనా.. కమర్షియల్ సక్సెస్ ను మాత్రం టేస్ట్ చేయలేకపోయాడు. ఎట్టకేలకు “రాక్షసుడు”తో ఫస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఊహించవి విధంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. ఆదివారం నుంచి థియేటర్లు కూడా పెంచారు. దాంతో బెల్లంకొండకెరీర్ లో మంచి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగానూ “రాక్షసుడు” నిలవనుందని విశ్లేషకులు, ట్రేడ్ పండిట్స్ ఫిక్స్ అయిపోయారు.

rakshasudu-movie-review1

అయితే.. లాభాల మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవ్వడంతో.. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ డీటెయిల్స్ చెప్పుకొచ్చారు. “సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. సినిమా బిజినెస్ పరంగా చూస్తే ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లు అమ్ముడుకాగా.. హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90కోట్లు అయ్యాయి. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు నిన్నటికే వచ్చాయి. చాలా చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగింది. అయితే సెకండ్ వీక్ చూస్తే ఫస్ట్ వీక్ కంటే అద్భుతంగా ఉంది. వైజాగ్, ఈస్ట్ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్ ఏరియాలో నిన్నటికే రూ.2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా లాభంతోనే స్టార్ట్ అయ్యింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ స‌ృష్టించేది. తమిళంలో కూడా తొలి వారం కంటే రెండు, మూడు వారాల్లోనే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి” అని వివరించారు బెల్లంకొండ సురేష్.

Share.