‘రాజుగారి గది3’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది 3’. అక్టోబర్ 18 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. స్టోరీ లేదు చీప్ కామెడీ అంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ ‘రాజుగారి గది’ సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ వలనో ఏమో కలెక్షన్లు మాత్రం బాగా వచ్చాయి.

raju-gari-gadhi-3-movie-review5

‘రాజుగారి గది3’ తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 42 L
సీడెడ్ 24 L
వైజాగ్ 16 L
ఈస్ట్ 10 L
వెస్ట్ 6 L
కృష్ణా 9 L
గుంటూరు 14 L
నెల్లూరు 4 L
ఏపీ + తెలంగాణ 1.25 Cr

‘రాజుగారి గది3’ చిత్రానికి 5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 1.25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ లు ఉన్నాయి.

Share.