సైరా నరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కి రజనీకాంత్

సైరా అంటున్నది మన మెగాస్టార్ చిరంజీవి కదా.. మధ్యలో రజనీకాంత్ ఎందుకొచ్చాడు? కొంపదీసి ఆయన కూడా ఈ సినిమాలో ఏదైనా కీలకపాత్ర పోషిస్తున్నాడా? అని తెగ ఆలోచించేయకండి. ఇక్కడ రజనీకాంత్ నిజంగానే సైరా నరసింహా రెడ్డి అనడానికి రెడీ అవుతున్నారు కానీ.. అది సినిమాలో నటించో లేక పవన్ కళ్యాణ్ లా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చో కాదు. త్వరలోనే హైద్రాబాద్ లో భారీ స్థాయిలో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కు రజనీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలవ్వనున్న ఈ చిత్రంలో అన్నీ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

rajinikanth-special-guest-for-sye-raa-movie-pre-release-event1

అందుకే.. అన్నీ భాషల్లోనూ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. హిందీలో జరగబోయే ఈవెంట్ కు బిగ్ బీ అమితాబ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. అలాగే.. తమిళ, మలయాళ భాషలకు సంబంధించిన ప్రముఖులు ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఆ విధంగా రజనీకాంత్ కూడా ఈ టీం లో పాల్గొననున్నారు. చిరంజీవి నటించిన 151వ సినిమా కావడం. బడ్జెట్ కూడా 200 కోట్లు దాటిపోవడం, ప్రీరిలీజ్ బిజినెస్ ఆల్రెడీ 100 కోట్ల పైన జరగడం అనేది సినిమా మీద అంచనాలను విశేషంగా పెంచేసింది.

Share.