జులాయిని మించిన కామెడీ రోల్లో రాజేంద్రప్రసాద్

కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ల క్యారెక్టర్స్ కంటే కమెడియన్ లేదా సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా ఫేమస్ అవుతుంటాయి. రీసెంట్ గా వచ్చిన “రాజా వారు రాణి గారు” సినిమాలో హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా ఫ్రెండ్ రోల్ పోషించిన రాజ్ కుమార్ క్యారెక్టర్ & పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ పేరు రావడం ఇందుకు సరైన ఉదాహరణ. అదే తరహాలో మహేష్ “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో కూడా రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ క్రేజీగా ఉండబోతోందట. సాధారణంగానే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే రాజేంద్రప్రసాద్ కామెడీ పండించమంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. సరిలేరులో ఆయన పాత్రను చాలా కేర్ ఫుల్ గా రాసుకొన్నాడట అనిల్ రావిపూడి.

Rajendra Prasad With Mahesh Babu

దూకుడులో బ్రహ్మానందం రేంజ్ లో సరిలేరులో రాజేంద్రప్రసాద్ రోల్ ఉండబోతోందని.. ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ బెస్ట్ కామిక్ రోల్ ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే ఎవరైనా “జులాయి” చెప్పేవారు.. ఇక నుంచి మాత్రం “సరిలేరు నీకెవ్వరు” చెబుతారని అంటున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.