అన్నింటికీ ప్రిపేర్ అయ్యే మా వాడ్ని హీరో చేస్తున్నాం!

ఒకప్పుడు నట వారసత్వాలు పనిచేసినా ప్రస్తుత కాలంలో మాత్రం అలాంటివి జరగదా లేదు. ఇండస్ట్రీకి చెందిన వారు తమ వారసులను సినిమాల్లోకి తీసుకొచ్చినా.. వారిలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినీ వారసుడు ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నాడు. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఫుల్ కంటెంట్ తోనే రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని అంటున్నారు సుమ, రాజీవ్ లు.జె.బి ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్‌పై హరి ప్రొడ్యూసర్‌గా, విజయ్ దర్శకత్వంలో రోషన్ హీరోగా చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేపట్టారు.

జనవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో తన కొడుకు రోషన్ సినిమా లాంచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజీవ్ కనకాల. సుమకి రోషన్ ని హీరోగా చేయడం ఇష్టమేనని.. మొదటినుండి కూడా పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయమని సుమ చెప్పేదని రాజీవ్ అన్నారు. హీరో అనే కాదు.. ప్రొడక్షన్ అయినా.. ప్రొడ్యూసర్ ఇలా ఏదైనా సరే ఇష్టం లేకుండా చేయకని సుమ.. రోషన్ కి చెప్తూనే ఉంటుందని రాజీవ్ అన్నారు.

తమ ఫ్యామిలీలో అందరూ నటీనటులేనని.. రోషన్ మూడో తరానికి చెందినవాడని.. తను కూడా సినిమాల్లోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. అన్నింటికీ ప్రిపేర్ అయ్యే అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. సన్ స్ట్రోక్ వచ్చినా ఏం చేయలేమని.. రంగంలోకి దిగిన తరువాత ఏ స్ట్రోక్ కి అయినా ప్రిపేర్డ్ గా ఉండాలని అన్నారు. తన కూతురు కూడా సినిమాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తుందని.. తను కూడా సినిమాల్లోకి రావొచ్చని అన్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Share.