చిన్న గొడవ జరిగింది.. ఇంత ఇష్యూ అవుతుందనుకోలేదు : రాజీవ్ కనకాల

గత కొద్దిరోజులుగా స్టార్ యాంకర్ సుమ పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుమకు అలాగే ఆమె భర్త రాజీవ్ కనకాలకు మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దాంతో ఇద్దరూ వేరుగా ఉంటున్నారని.. అంతేకాదు రాజీవ్ కనకాల చెల్లెలు చనిపోవడం వల్లనే రాజీవ్ వద్దకు వెళ్ళింది కానీ.. ఆమె అతనితో కలిసి ఉండడం లేదని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై సుమ స్పందించలేదు. కానీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అన్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ వార్తల పై ఆమె భర్త మరియు ప్రముఖ నటుడు అయిన రాజీవ్ కనకాల స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “గతంలో సుమకి నాకు మధ్య చిన్నపాటి గొడవ జరిగిన మాట వాస్తవమే.ఇది పెద్ద విషయం ఏమీ కాదు.. అందరి ఇళ్లల్లో భార్య భర్తల మధ్య జరిగే గొడవలాంటిదే మా మధ్య కూడా జరిగింది. తరువాత అది క్లియర్ అయిపోయింది కూడా..! అయితే అది బయటకి వేరేలా వచ్చి ఉండొచ్చు. దానిని ఏకంగా.. విడాకులు వరకూ తీసుకెళ్లారు. ఆ వార్తల్ని చూసి నేను షాకయ్యాను.. ఇదేంటి?? ఏకంగా మేము విడాకులు తీసుకునే వరకూ వెళ్ళిపోయామా? అనుకున్నాం. ఏమీ లేని విషయం పై మేము రెస్పాండ్ అవ్వడం ఎందుకు..? అది కూడా మళ్లీ వేరే విధంగా వెళ్తుంది అనిపించింది. ఎందుకొచ్చిన గొడవ.. కలిసి ఉన్నట్టుగానే ఒక వీడియో వెళ్తే వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని భావించి..

Anchor Suma Rajiv Kanakala Purchases New House1

ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాం. విడాకులు అంటూ వచ్చిన వార్తలకి సుమ చాలా బాధ పడింది. ‘ఏంటిది.. ఇలాంటి వార్తలు వస్తున్నాయి?? ఇవి మా పిల్లల పై ఎఫెక్ట్ చూపిస్తాయి కదా.. చుట్టూ ఉన్నవాళ్లు వేరే విధంగా కూడా మాట్లాడుకుంటారని’ ఫీల్ అయ్యింది. సుమకు ఓపిక ఎక్కువ.. ముఖం పై చిరునవ్వును మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోదు. ఆమెలో అది నాకు బాగా నచ్చుతుంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Share.