‘ఒరేయ్ బుజ్జిగా’ టీజర్ రివ్యూ..!

రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ హిట్లు కొట్టి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో. అంతేకాదు రవితేజ మాదిరి మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర కూడా వేయించుకున్నాడు. కానీ కట్ చేస్తే ఆ తరువాత సీనంతా రెవర్స్ అయిపొయింది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే సినిమా తరువాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏమీ హిట్ అవ్వలేదు. దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాలను కూడా జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం చేసాడు.

Raj Tarun's Orey Bujjiga Movie Teaser Review1

‘గుండె జారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ వంటి హిట్లు అందుకున్న డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హెబ్బా పటేల్, మాళవిక నాయర్ హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్ ఏమాత్రం కొత్తగా లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకూ రాజ్ తరుణ్ చేసిన సినిమాలన్నీ మిక్సీలో వేసి జ్యుస్ తీసినట్టు.. చాలా రొటీన్ గా ఉంది. మధ్య మధ్యలో వచ్చే పంచ్ డైలాగులు కూడా మన రెగ్యులర్ వాట్సాప్ జోకులు మాదిరి ఉండడం విశేషం. ‘ఖైదీ’ (తమిళ్) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందించిన నిర్మాత కావడం.. మంచి టేస్ట్ ఉన్న మరియు.. మంచి నటన కనపరిచే మాళవిక నాయర్ హీరోయిన్ కావడం మాత్రమే ఈ చిత్రం పై కొద్దిపాటి అంచనాల్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. టీజర్ అయితే ఏమాత్రం అట్రాక్ట్ చేసేలా లేదు. కావాలంటే మీరే ఓ లుక్కెయ్యండి.


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Share.