‘డ్రీమ్ గర్ల్’ తెలుగు రీమేక్ పక్కా!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు అందుకున్నాడు. ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. కానీ ఆ సక్సెస్ ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయాడు. సరైన కథలను ఎంపిక చేసుకోలేక వరుస ప్లాప్ లతో డీలా పడ్డాడు. లాక్ డౌన్ లో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా.. దానికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

ఆ సినిమా తీసిన దర్శకుడు విజయ్ కుమార్ కొండాతోనే ఇప్పుడు ‘పవర్ ప్లే’ అనే సినిమా చేశాడు రాజ్ తరుణ్. ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. రాజ్ తరుణ్ కి ప్రస్తుతం సక్సెస్ లు లేకపోయినా.. అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు ఈ కుర్ర హీరో.

గతంలో తనతో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. అలానే విరించి వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ కాకుండా శాంటో అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా, అలానే విజయ్ కుమార్ కొండాతో మరో సినిమా ఉంటుందని చెప్పాడు. హిందీలో సక్సెస్ అయిన ‘డ్రీమ్ గర్ల్’ అనే సినిమా తెలుగు రీమేక్ ని విజయ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారని చెప్పాడు. ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయబోతున్నట్లు రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.