ఆ డైరెక్టర్ తో కంఫర్ట్‌గా ఉంటుంది : రాజ్ తరుణ్

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమయ్యారు రాజ్ తరుణ్. సినిమాల్లోకి రాకముందే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ కు హీరోగా నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన పవర్ ప్లే సినిమా నేడు విడుదలవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్ కావాలనే సినిమాను స్టార్ట్ చేస్తామని.. అయితే ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని రాజ్ తరుణ్ అన్నారు. కొత్త జానర్ లో సినిమాను ట్రై చేసినప్పుడు సక్సెస్, ఫెయిల్యూర్ లను పట్టించుకోకూడదని.. అయితే చేసిన తప్పులు మాత్రం మళ్లీ చేయకూడదని రాజ్ తరుణ్ అన్నారు.

అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల అమాయకుడైన ఒక వ్యక్తి సమస్యల్లో చిక్కుకుంటాడని.. ఆ సమస్యల నుంచి ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడు..? అధికారంలో ఉన్నవాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడనే కథతో పవర్ ప్లే సినిమా తెరకెక్కుతోందని రాజ్ తరుణ్ చెప్పారు. తాను ప్రతి సినిమాకు నూటికి నూరు శాతం కష్టపడతానని.. సినిమా ఫలితం మాత్రం పూర్తిగా ప్రేక్షకుల చేతిలో ఉంటుందని రాజ్ తరుణ్ తెలిపారు.

raj-tarun-starrer-directed-by-konda-vijaykumars-movie-launched

ప్రేక్షకులు సినిమా బాగుంటే ఏ ఫ్లాట్ ఫామ్ లో అయినా చూస్తారని.. థియేటర్ లో సినిమా చూసిన అనుభవం మాత్రం వేరని రాజ్ తరుణ్ అన్నారు. విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో వరుస సినిమాలు చేయడం గురించి స్పందిస్తూ ఆ డైరెక్టర్ తో తనకు కంఫర్ట్ గా ఉంటుందని.. ఆ కారణం వల్లే విజయ్ డైరెక్షన్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానని చెప్పారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.