Raj Tarun: ఆ ఘటన రాజ్ తరుణ్ ను భయపెట్టిందా..?

పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. ఉయ్యాల జంపాల సినిమా సక్సెస్ సాధించగా రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలు సైతం అంచనాలను మించి విజయం సాధించాయి. అయితే కుమారి 21ఎఫ్ సినిమా తరువాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే.

చేతినిండా సినిమాలు ఉన్నా సరైన సక్సెస్ లేకపోవడంతో రాజ్ తరుణ్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలల క్రితం ఒక యాక్సిడెంట్ ద్వారా రాజ్ తరుణ్ వార్తల్లో నిలిచారు. అయితే ఆ యాక్సిడెంట్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పుకొచ్చారు. ఆ యాక్సిడెంట్ ఘటన వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ ఘటన జరిగిన సమయంలో తనకు వైరల్ ఫీవర్ కూడా వచ్చిందని రాజ్ తరుణ్ అన్నారు.

తాను రాజా రవీంద్రకు కాల్ చేసి తనకు ఎవరికీ సమాధానం చెప్పే ఆసక్తి లేదని తనకు ఏం చెప్పొద్దని చెప్పానని రాజ్ తరుణ్ వెల్లడించారు. కార్తీక్ అనే వ్యక్తి తనకు అస్సలు పరిచయం లేదని ఆ వ్యక్తి చేసింది తప్పే అని అలా డబ్బులు డిమాండ్ చేశాడంటే తనకు ఏం అవసరాలు ఉన్నాయో అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఆ ఘటన తర్వాత డ్రైవింగ్ మానేశానని రాజ్ తరుణ్ వెల్లడించారు. రాజ్ తరుణ్ ను ఆ ఘటన భయపెట్టిందని రాజ్ తరుణ్ మాటలు వింటే అర్థమవుతోంది.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.