వెంకీ మామ సినిమాలో రాశీఖన్నా క్యూట్ లుక్!

చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా.. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా అనంతరం మరీ బొద్దుగా తయారవ్వడాన్ని ఆమె అభిమానులు రుచించుకోలేకపోతున్నారని గ్రహించి అమ్మడు బాగా తగ్గింది. ఎంతగా అంటే ఏంటి ఈ అమ్మాయి రాశీఖన్నాయేనా? అని ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా తగ్గింది రాశీ. ఆమె బాగా తగ్గిన తర్వాత నటిస్తున్న సినిమా “వెంకీ మామ”. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కథానాయికగా నటిస్తున్న రాశీ.. ఇటీవల షూటింగ్ స్పాట్ నుండి బాబాయ్ గారు వెంకీతో కలిసి తీసుకొన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా విడుదల చేసింది.

raashi-khanna-shares-a-fan-girl-moment-with-venkatesh-from-venky-mama-sets1

అచ్చం పల్లెటూరి పడుచులా ఆరు గజాల చీరతో అద్భుతంగా ఉంది రాశీఖన్నా. అప్పుడెప్పుడో “మనం” సినిమాలో నాగచైతన్య సరసన చిన్న రోల్ ప్లే చేసిన రాశీఖన్నా.. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్లో కనిపించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుట్ నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది.

Share.