టీజర్ కట్స్ మొదలెట్టిన సుకుమార్ & టీం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియా సెలబ్రేషన్స్ మొదలెట్టేసారు. గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సుకుమార్ “పుష్ప” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అల్లు అర్జున్ అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, మొదటి మల్టీ లింగువల్ ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం విశేషం.

“అల వైకుంఠపురములో” తర్వాత బన్నీ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. అందుకే పుష్పను పరాయి భాషల్లోనూ విడుదల చేసి మార్కెట్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు బన్నీ-సుక్కు. ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” టీజర్ ను రిలీజ్ చేసేందుకు సుక్కు & టీమ్ సన్నద్ధమవుతున్నారు. ఆల్రెడీ టీజర్ ను కట్ చేయడం మొదలెట్టారట. ట్రైలర్ రిలీజ్ చేయాలంటేనే పది రకాల వెర్షన్ ను కట్ చేసే సుక్కు..

బన్నీ బర్త్ డే ప్రెజంట్ గా రిలీజ్ చేసే టీజర్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో చెప్పనవసరం లేదు. బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ ఎవరు అనేది ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. సో, టీజర్ కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.