స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్!

‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతుంది చిత్రబృందం. దానికి తగ్గట్లుగా పనులను కూడా మొదలుపెట్టారట. తాజాగా టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రయూనిట్.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 13న సినిమా రిలీజ్ పెట్టుకున్నారు కాబట్టి ఏప్రిల్ నాటికి టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. పైగా స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కి ఇదొక ట్రీట్ లా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి టీజర్ ని ఎలా కట్ చేయాలనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు, మూడు టీజర్స్ ని కట్ చేసి అందులో ది బెస్ట్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ సినిమా కోసం చిత్రబృందం గ్యాప్ లేకుండా పనిచేస్తోంది. ఇప్పటికే రంపచోడవరంలో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. హైదరాబాద్ లో కూడా ఓ షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులోని టెన్‌కాశిలో సినిమా కొత్త షెడ్యూల్ జరుగుతోంది. అక్కడ హీరో కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.