Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ఏమైందంటే..?

దేశంలో గడిచిన పది రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతేడాది లాక్ డౌన్ అమలు చేయడంతో ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలయ్యాయి. అయితే కేంద్రం వేర్వేరు కారణాల వల్ల ఈ ఏడాది లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా సినిమా రంగంపై ఆ ప్రభావం బాగానే పడుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రిలీజ్ డేట్ కూడా మారినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆర్య, ఆర్య 2 సినిమాల తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఆర్య, ఆర్య 2 సినిమాల్లో అల్లు అర్జున్ ను క్లాస్ గా చూపించిన సుకుమార్ పుష్ప సినిమాలో మాత్రం ఊరమాస్ గా చూపిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు ఆగష్టు 13వ తేదీన స్వాతంత్ర దినోత్సవం కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మొదట ప్రకటించారు.

కరోనా సెకండ్ వేవ్ వల్ల పుష్ప సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ ఉండటంతో ఈ సినిమా నాలుగు నెలలు వెనక్కు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని పుష్ప దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దాదాపు 160 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫహద్ ఫజల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. యూట్యూబ్ లో పుష్ప టీజర్ కు 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Share.