నాగ్-పూరి.. కాంబో సెట్ అవుతుందా..?

అక్కినేని నాగార్జున, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో ‘శివమణి’, ‘సూపర్’ వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘శివమణి’ సూపర్ హిట్ అయినప్పటికీ ‘సూపర్’ మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఆ తరువాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. దాదాపు దశాబ్దన్నర తరువాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇటీవల పూరి జగన్నాథ్.. నాగార్జునకు ఓ కథ చెప్పి మెప్పించారని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.

నాగార్జున కోసం ఓ ఫాంటసీ కథను రాసుకున్నాడట పూరి. చరిత్రలో వెనుకటి కాలానికి చెందిన ఒక రాజు.. విచిత్ర పరిణామాల మధ్య మళ్లీ ఈ కాలంలోకి అడుగుపెడతాడట. ఇప్పటికీ తనను తాను రాజుగానే భావిస్తో పెత్తనం చెలాయించాలని చూసినప్పుడు ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని సమాచారం. కమర్షియల్ సినిమాకే ఫాంటసీ టచ్ ఇస్తూ ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి చేసిన తరువాత ప్రవీణ్ సత్తారుతో సినిమా చేస్తాడని ఓ పక్క, ‘బంగార్రాజు’ సినిమా చేయబోతున్నాడని మరో పక్క వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మధ్యలోకి పూరి జగన్నాథ్ వచ్చాడు. మరి ముందుగా ఏ సినిమాను మొదలుపెడతాడో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.