మహేష్ పై పూరి షాకింగ్ కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ను సాధించింది. సుమారు నాలుగేళ్ళ తర్వాత హిట్టు కొట్టాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో రామ్ ను ఊర మాస్ గా చూపించి ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించాడు. అయితే ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా పూరి.. మహేష్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ పూరి పై మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కంటే.. నాకు మహేష్ ఫ్యాన్సంటేనే ఎక్కువ ఇష్టం అంటూ కామెంట్ చేశాడు.

puri-jagannadh-return-counter-to-mahesh-babu1

ఇందులో తప్పేముంది.. తన అభిప్రాయం చెప్పాడు.. అంతే కదా..! అని అనుకుంటున్నారా..? అయితే పూరి పూర్తి మాటలు ఎలా ఉన్నాయో చూడండి. పూరి మాట్లాడుతూ.. “మహేష్ బాబు ఫ్యాన్స్ దగ్గరి నుంచీ.. ‘అన్నా.. ‘జనగణమన’ చెయ్యన్నా.. మహేష్ తో చెయ్యన్నా..’ అని అడుగుతున్నారు. నేను మహేష్ తో రెండు మంచి సినిమాలు చేశాననే అభిమానం వాళ్ళకి ఉంది. ఇలా ప్రతీసారి అడుగుతుంటారు. కానీ వాళ్ళకి అర్ధం కానిదేంటంటే.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు. ఈ విషయం నేను చాలా సార్లు చెబుదామనుకున్నాను మహేష్ ఫ్యాన్స్ కి..! నాకు మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ ఎక్కువ ఇష్టం. కనీసం వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఏమో ఇస్మార్ట్ శంకర్’ హిట్టయితే మహేష్ మీరన్నట్టు సినిమా చేస్తారేమో.. అని యాంకర్ అడగగా… ‘నేను ఓకె చెప్పడానికి నాకూ.. ఓ క్యారెక్టర్ ఉంటుంది కదా’ అంటూ కామెంట్స్ చేసాడు.

ఇప్పుడు ఈ విషయం పైనే మహేష్ ఫ్యాన్స్ పూరీని ట్రోల్ చేస్తున్నారు. మహేష్ తో ‘పోకిరి’ కి ముందు ‘సూపర్’ ‘143’ ‘ఆంధ్రావాలా’ వంటి ప్లాపులున్నాయి సర్ మీకు.. అలాగే ‘బిజినెస్ మేన్’ కు ముందు ‘నేను నా రాక్షసి’ ‘గోలీమార్’ ‘ఏక్ నిరంజన్’ వంటి ప్లాపులు తీశారు.. మరిచిపోయినట్టున్నారు పూరి సార్’ అంటూ లాజికల్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ లో మహేష్ ‘పోకిరి’ సినిమా గురించి కానీ పూరి జగన్నాథ్ గురించి కానీ.. మాట్లాడలేదు. ఇప్పుడు పూరి ఇలా కామెంట్ చేసాడు. దీనిని బట్టే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు వచ్చునంటాయని ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


View this post on Instagram

A post shared by Phani Kumar (@phani.darling.96) on

Share.