బన్నీ ట్వీట్ పూరీకి బాగా కిక్ ఇచ్చినట్లుందిగా..!

స్టార్ హీరోలకు తగ్గని ఫాలోయింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ సొంతం. జయాపజయాలు పక్కన పెడితే ఆయనన్నా, ఆయన సినిమాలన్నా అమితంగా ప్రేమించే వారు ఎందరో ఉన్నారు. హీరోయిజం కి పూరి కొత్త మేనరిజం పరిచయం చేశాడు. పూరి హీరోలు చాలా కొత్తగా ఉంటారు. అలాగే పూరి సినిమాలో జీవిత సత్యాలు చాలా షార్ప్ వర్డ్స్ తో నిక్కచ్చిగా ఉంటాయి. ఉన్న విషయం చెప్పడానికి పూరి వాడే పదజాలం కాంటెంపరరీగా ఉంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా ఉంటుందన్న మాట. కాగా పూరి కొన్ని జీవిత సత్యాలను ప్రస్తావిస్తూ కొన్ని మ్యూసింగ్స్ చేశారు. అవి ఇప్పుడు స్పాటిఫై, ఆపిల్ పాడ్ కాస్ట్స్ లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఇవి విన్న హీరో అల్లు అర్జున్ దర్శకుడు పూరీని ఆకాశానికి ఎత్తేశాడు. మీరు చర్చించిన టాపిక్స్ అద్భుతం, ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి మీరు గ్రేట్ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ప్రతి ట్వీట్ గా పూరి ”అపరిమిత ఆనందం కలిగింది.

నీలాంటి సక్సెస్ ఫుల్ యంగ్ స్టర్ నుండి కాంప్లిమెంట్ రావడం అంటే, చిన్న విషయం కాదు. ఈ ఆనంద సమయంలో నేడు ఓ పెగ్ ఎక్కువ వేస్తాను. చీర్స్.. ఐ లవ్ యు..” అన్నారు. బన్నీ కాంప్లిమెంట్ పూరికి భారీ కిక్ ఇచ్చినట్లు ఆయన ట్వీట్ ద్వారా అర్థం అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రెండు చిత్రాలు రాగా దేశముదురు మంచి విజయాన్ని అందుకుంది. ఇద్దరు అమ్మాయిలతో యావరేజ్ అనిపించుకుంది.

Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Share.