అలీ గురించి అసలు నిజాలు బయట పెట్టిన పూరి జగన్నాధ్

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఓ ఊపు ఊపేసాడు అలీ. కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఓ పక్క హీరోగా చేస్తూనే కమెడియన్ గా కూడా చేశాడు. చాలా కాలం తరువాత అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం ఆగష్టు 23న విడుదల కాబోతుంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి పూరి జగన్నాధ్, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

puri-jagannadh-about-comedian-ali1

ఇక ఈ వేడుకలో డాషింగ్ డైరెక్టర్ పూరి తన మార్క్ కామెంట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. “నా సినిమా హిట్టై సంతోషంలో ఉన్నా.. ప్లాపయ్యి నిరాశలో ఉన్నా అలీ ఒక్కడే న దగ్గరికి పిలవకుండా వస్తాడు. సినిమా హిట్టయితే ఓ ‘హగ్’ ఇచ్చి విష్ చేసి వెళ్తాడు. అదే ఫ్లాపయ్యి నిరాశలో ఉంటే.. నాకు ఓ ‘పెగ్’ పోసి ధైర్యం చెప్పి వెళ్తాడు. మా ఇద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అలీ చేసిన పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. నా జీవితంలో కొన్ని గ్యాంబ్లింగ్స్ జరిగి ఆస్తులు పోగొట్టుకున్నాను. చివరకు ఆఫీస్ కూడా అమ్మేసి వెళ్ళిపోతుంటే.. అలీ పలకరించడానికి వచ్చాడు. అమ్మవారి దగ్గర పూజ చేసిన చిన్న విగ్రహాన్ని నాకు ఇచ్చాడు. ‘దీనిని మెడలో వేసుకో భయ్యా …. దేవుడిపై నమ్మకం లేకుంటే కనీసం జేబులో పెట్టుకుని అయినా తిరుగు.. దెబ్బతో పోయిన.. నీ ఆస్తులన్నీ తిరిగొస్తాయి’ అని చెప్పాడు. అలీ ఆ మాట చెప్పిన రెండేళ్ళకు నా ఆస్తులు మొత్తం తిరిగొచ్చాయి’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.

Share.