షాకింగ్ నిజాలు బయటపెట్టిన పునర్నవి భూపాలం..!

‘బిగ్ బాస్3’ లో అందరికీ గుర్తుండి పోయే కంటెస్టెంట్ లలో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం టాప్ లో ఉంటారు అనడంలో సందేహం లేదు. వీళ్ళిద్దరూ మొదటి నుండీ స్నేహంగా ఉండడం.. హగ్ లు, కిస్ లు వంటివి జరగడంతో వీళ్ళు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కేవలం వీరికోసమే షో చూసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక హౌస్ నుండీ బయటకి వచ్చాక.. మీరు పెళ్ళిచేసుకుంటారా అని పలువురు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదు అని తేల్చి చెప్పేసారు.

Punarnavi Bhupalam Latest Photoshoot Still

అయితే పున్నుతో డేటింగ్ చేయడానికి అడిగాను కానీ.. ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అది తప్పు అని రాహుల్ తెలిపాడు. ఈ క్రమంలో ఇటీవల పునర్నవి పాల్గొన్న ఓ షోలో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. పునర్నవి తన ప్రియుడి గురించి మాట్లాడుతూ.. “నన్ను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో లేడు.. చనిపోయాడు. తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్.నన్ను చాలా ఇష్టపడ్డాడు. కెరీర్లో సెటిల్ కాకుండా పెళ్ళి వద్దనే ఉద్దేశంతో నేను అతన్ని దూరం పెట్టాను. తరువాత ఎవరి మా కెరీర్ పనుల్లో మేము బిజీ అయిపోయి పట్టించుకోలేదు. మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయి.. అదే సమయంలో తాను అమెరికాకు వెళ్ళాను.. నేను వచ్చేసరికి ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో అతను చనిపోయాడు. అతను నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి. మనిషి ఉన్నపుడు విలువ తెలీదు.. అతను నాకో జ్ఞాపకంగా మిగిలిపోయాడు. అతను లేడనేసరికి కుంగిపోయాను. అదే సమయంలో ‘బిగ్ బాస్’ ఆఫర్ రావడంతో జీవితంలో మార్పు ఉంటుందని భావించి ఒప్పుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అలా చూసుకుంటే… పునర్నవి జీవితంలో ఎవరూ లేరు. మరి రాహుల్‌కు దగ్గరైంది కాబట్టి పెళ్ళిచేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.