బిగ్ బాస్ 4: బిగ్ బాస్ టీమ్ పై పబ్లిక్ ఫైర్..!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆదివారం అట్టహాసంగా జరిగింది. హీరోయిన్స్ డ్యాన్స్ లతో, థమన్ మ్యూజిక్ సాంగ్స్ తో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన మెగాస్టార్ చేసిన హంగామా తో ఎపిసోడ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఈ సీజన్ 4 విజేతగా అభిజీత్ టైటిల్ గెలవడం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. కానీ, ప్రైజ్ మనీలో కోత పెట్టడం అనేది ఆగ్రహాన్ని తెప్పించింది. సోమవారం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పోస్టర్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

విన్నర్ గా వచ్చినవాళ్లకి 50లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ముగ్గురు లోపల ఉన్నప్పుడు 25లక్షలు ఇచ్చి ఒక్కరిని తీస్కోమనడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సోహైల్ 25లక్షలు తీసుకుని కావాలనే బయటకి వచ్చాడంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఏదైనా ప్రైజ్ మనీ ఉంటే విన్నర్ కి మొత్తం వచ్చేలా చూసే బాధ్యత బిగ్ బాస్ టీమ్ చూసుకోవాలని, అలా ప్రైజ్ మనీలో కోతపెట్టడం అనేది చాలా అన్ ఫైయిర్ అని అంటున్నారు.

అంతేకాదు, ఓట్లు వేసి విన్నర్ ని చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు సోహైల్ అంతకంటే ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందటం, రన్నరప్ అయిన అఖిల్ కి ఏం లేకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదని ప్రశ్నిస్తున్నారు. ఇక రకరకాల మీమ్స్, పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.