Love Story: నిర్మాతల పాలిట వరమవుతున్న సాయిపల్లవి..?

తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోని సినిమాల్లో కూడా సాయిపల్లవికి నటిగా మంచి పేరు, గుర్తింపు ఉంది. ఆ పేరు, గుర్తింపే ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల పాలిట వరమవుతోంది. సాయిపల్లవికి బహుభాషానటిగా గుర్తింపు ఉండటంతో ఆమె సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు లవ్ స్టోరీ సినిమా తెలుగులో ఈ నెల 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకనిర్మాతలు కన్నడ, మలయాళ భాషల్లో కూడా లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.

నాగచైతన్యకు తెలుగులో క్రేజ్ బాగానే ఉన్నా ఇతర భాషల్లో పెద్దగా గుర్తింపు లేదు. అయితే సాయిపల్లవికి మాత్రం ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉండటం నిర్మాతల పాలిట వరమవుతోంది. లవ్ స్టోరీ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఉండటం కూడా ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావడానికి కారణమవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు సైతం సారంగదరియా పాట ఎంతగానో నచ్చేసింది. ఈ భాష ఆ భాష అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్టైన సారంగదరియా పాట 10 కోట్ల వ్యూస్ ను అందుకోవడం గమనార్హం.

తమిళంలో కూడా సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో హిట్టైతే లవ్ స్టోరీ సినిమా తమిళంలో కూడా రిలీజయ్యే అవకాశం ఉంటుంది. ఫిదా తరువాత కొత్తవాళ్లతో లవ్ స్టోరీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నాగచైతన్య, సాయిపల్లవిలను తీసుకొని రీషూట్ చేశారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాలను అందించడం గమనార్హం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.