పివిపి ప్రాపర్టీని ఆక్షన్ కి పెట్టిన కెనెరా బ్యాంక్

తన బ్యానర్ లో భారీస్థాయి బ్లాక్ బస్టర్స్ లేకపోయినా.. హిట్స్ కంటే ఎక్కువగా ఫ్లాప్ సినిమాలు ప్రొడ్యూస్ చేసినా.. టాలీవుడ్ అగ్ర నిర్మాతల జాబితాలో సునాయాసంగా స్థానం సంపాదించుకొన్న వ్యక్తి ప్రసాద్ వి.పొట్లూరి. అందుకు కారణం ఆయన తీసిన సినిమాలు కాదు.. వ్యక్తిగా అతని సంపన్న స్థితి. ఇటీవల విజయవాడ నుంచి ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రసాద్ వి.పొట్లూరికి కేనేరా బ్యాంక్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికలకు ముందు కేనేరా బ్యాంక్ నుంచి ఆర్ధిక లావాదేవీల కోసం దాదాపు 148 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొన్నారట. ఆయన సతీమణి ఝాన్సీ సూరెడ్డి పేరు మీద తీసుకొన్న ఈ భారీ లోన్ కు సూరిటీగా చెన్నైలోని పివిపి క్యాపిటల్ కు చెందిన 2,62,160 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని బ్యాంకుకు అప్పగించారు.

producer-pvp-in-big-trouble1

అయితే.. గత కొన్ని నెలలుగా సదరు అప్పును తీర్చలేకపోవడమే కాక వడ్డీ కూడా కట్టకపోవడంతో కేనేరా బ్యాంక్ చెన్నైలోని పివిపి స్ఠలాన్ని ఆక్షన్ కు పెట్టింది. ఈ విషయం రాజకీయ రంగు పులుముకొని పివిపి మీద అపోజిషన్ పార్టీ మెంబర్స్ రాజకీయ దాడికి దిగారు. అయితే.. తాను ఈ ఏడాది హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్ అని.. కుదిరితే రానున్న 90 ఏళ్లలో నా స్థాయిలో ట్యాక్స్ కట్టి చూపమని పివిపి కూడా సవాలు విసిరారనుకోండి. అయినప్పటికీ.. పివిపి లాంటి ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఇలా ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవడం అనేది బాధాకరం.

Share.