ఆ హీరోయిన్లకు మాత్రమే ఎక్కువ ఇస్తారు : ప్రియమణి

‘హీరోతో సమానంగా హీరోయిన్లకు రేమ్యునరేషన్ ఇవ్వరు. వారితో సమానంగా ప్రాధాన్యత కూడా ఉండదు’. ఇవి ఎప్పటి నుండో చాలా మంది హీరోయిన్లు చెప్పుకొచ్చిన మాటలే. నిజానికి వారు చెప్పింది కరెక్టే. సినిమా కలెక్షన్లు హీరో ఇమేజ్ ను బేస్ చేసుకుని మాత్రమే వస్తాయి. అలాంటప్పుడు హీరోయిన్ అదనపు ఆకర్షణ మాత్రమేనా..? అంటే అలా కూడా తీసిపారేయలేము. స్క్రిప్ట్, అలాగే హీరోయిన్లు ఇచ్చే డేట్స్ బట్టి వారికి రేమ్యునరేషన్ ఉంటుంది.

priyamani-shocking-comments-on-star-actress1

ఇక హీరోయిన్ల పరిస్ధితి ఇంతే అంటూ .. ఓ ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియమణి. ‘హీరోయిన్లకు తక్కువ రేమ్యూనరేషన్ మాత్రమే ఇస్తారు. ఎక్కువ డిమాండ్ చేసినా.. ఎవ్వరూ పట్టించుకోరు. సౌత్ లో అనుష్క, సమంత, నయన తారకు మాత్రమే ఎక్కువ ఇస్తుంటారు. ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినా వారు వెనుకాడరు. మిగిలిన హీరోయిన్ల పరిస్ధితి ఇంతే..’ అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.