కంట తడి పెట్టిస్తున్న మల్లేశం కథ

తెలంగాణ సినిమా అంటే యాస మాత్రమే కనిపిస్తుంది కానీ జీవం కనిపించడం లేదు. మహా అయితే బూతులు, మరీ ఎక్కువ అనుకుంటే పోరాటాలు తప్ప ఏముంది తెలంగాణ సినిమాలో.. సహజత్వం, ప్రాంతీయత ఎక్కడ కనిపిస్తున్నాయి? అని ప్రశ్నించివరారు లేకపోలేదు. అందుకు కారణం తెలంగాణా సినిమా అనే బ్రాండ్ కింద విడుదలైన సినిమాలన్నీ ఉంటే వైల్డ్ & హార్డ్ కోర్ గా ఉంటాయి లేదంటే తెలంగాణ సాధించుకోవడం కొందరు చేసిన పోరాటాల నేపధ్యంలో మాత్రమే ఉంటాయని మొన్నటివరకూ ఒక అపవాదు ఉండేది. ఆ సినిమాలు కూడా అలాంటివే అనుకోండి.

mallesham-theatrical-trailer-review1

mallesham-theatrical-trailer-review2

కానీ.. మొట్టమొదటిసారిగా తెలంగాణ సినిమా అంటే ఒక భావం కనిపించింది, ఒక జీవితం దర్శనమిచ్చింది, ఒక బాధ మన గుండెల్ని కలచి వేసింది. అదే “మల్లేశం”. ప్రియదర్శి టైటిల్ పాత్రలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ట్రైలర్ లోనే జీవం కనిపించింది. రాజ్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సురేష్ బాబు నేతృత్వంలో విడుదలవుతోంది. ఇదిరా తెలంగాణ సినిమా అంటే అని ప్రతి తెలంగాణవాది కాలర్ ఎగరేసేలా ఉందీ ట్రైలర్. సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని, ఈ తరహా కథాంశాలతో మరిన్ని తెలంగాణ సినిమాలు రావాలని కోరుకొందాం.

Share.