‘లైగర్‌’లో ప్రభుదేవా.. ఫొటోలు వైరల్‌

విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’సినిమాకు సంబంధించి ఏ ఫొటో బయటికొచ్చిన వైరల్‌గా మారుతున్నాయి. మొన్నామధ్య సారా అలీ ఖాన్‌ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ‘లైగర్‌’లో సారా అలీ ఖాన్‌ నటిస్తోందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో రెండు ఫొటోలు ఇప్పుడు బయటికొచ్చాయి. ఇంకేముంది ‘లైగర్‌’లో ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి నటిస్తున్నాడంటూ పుకార్లు వస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజముందో టీమే చెప్పాలి. ‘లైగర్‌’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది.

ఈ క్రమంలో సినిమా అప్‌డేట్స్‌ను చిత్రబృందం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంది. అలా ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు అయిన ప్రభుదేవాతో దిగిన ఫొటోలను చిత్ర సహ నిర్మాత ఛార్మి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో ప్రభుదేవా గుండు లుక్‌లో, మీసంతో వెరైటీగా కనిపిస్తున్నాడు. అదంతా పక్కనపెడితే ఎందుకు ప్రభుదేవాను ఛార్మి, పూరి కలిశారనేదే ఇప్పుడు టాపిక్‌. ‘లైగర్‌’ డ్యాన్స్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ అంటే అందులో కొరియోగ్రాఫర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు అనుకోవచ్చు.

కానీ ఇది యాక్షన్‌ ఫిల్మ్‌. మరి ఇందులో ఏదైనా క్యారెక్టర్‌ కోసం కలిశారేమో. లేకపోతే స్పెషల్‌ పాట ఏదైనా ఉందేమో, దాని కొరియోగ్రఫీ కోసం పిలిచారేమో. వీటిపై చిత్రబృందమే క్లారిటీ ఇవ్వాలి. పాన్​ ఇండియాగా తెరకెక్కుతున్న ‘లైగర్‌’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇందులో విజయ్‌ దేవరకొండ సరసన అనన్యా పాండే నటిస్తోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.