నానికి , వరుణ్ లకి ప్రభాస్ యాంటీ అవుతున్నాడా?

అవును ఇప్పుడు ప్రభాస్ వల్ల వరుణ్ తేజ్, నానిలకు లేని పోని టెన్షన్ వచ్చిపడింది. అసలు ప్రభాస్ వల్ల నానికి, వరుణ్ కి ఎందుకు టెన్షన్ వచ్చింది. అంతలా ప్రభాస్ ఏం చేసాడు అనేగా మీ డౌట్.? ప్రభాస్ ఏమీ చేయలేదండీ…! ప్రభాస్ సినిమా ‘సాహో’ ఆగష్టు 15 నుండీ 30 వెళ్ళింది కదా… అక్కడ వచ్చింది సమస్యంతా? విషయం ఏమిటంటే ‘సాహో’ చిత్రాన్ని మొదట ఆగష్టు 15 న విడుదల చేయాలనుకున్నారు… అయితే ప్యాచ్ వర్క్ ఉండడంతో ఆగష్టు 30 కి మార్చారు.

saaho-movie-teaser-review1

ఇక ‘సాహో’ చిత్రం ఎలాగు ఆగష్టు 15 న వచ్చేస్తుంది కదా… అని నాని తన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని ఆగష్టు 30 కి విడుదల చేయాలనుకున్నాడు. ఆ తరువాత వరుణ్ సినిమా ‘వాల్మీకి’ సెప్టెంబర్ 6 ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆగష్టు 30 న ‘సాహో’ విడుదల కాబోతుంది కాబట్టి.. నాని ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. దీంతో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ని కూడా మరో సెప్టెంబర్ 2 వ వారానికి మార్చబోతున్నట్టు తెలుస్తుంది.

Share.