దీపిక కండిషన్ కు ఓకే చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ..!

ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్న ప్రభాస్.. ఈ చిత్రం తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘వైజయంతి మూవీస్’ అధినేత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని సుమారు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో.. ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారని తెలుస్తుంది.

విలన్ గా అరవింద్ స్వామి లేదా రానా ను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో అయ్యాడు కాబట్టి.. అక్కడి హీరోయిన్ నే.. తీసుకోవాలి అని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా… ముందుగా దీపికా పడుకోణె ను అనుకున్నారట.ఆమెతో సంప్రదింపులు జరిపితే… ఏకంగా 15 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. దానికి ఓకే చెబితేనే.. సినిమా చేస్తాను అని తేల్చి చెప్పిందట.

దాంతో కియారా అద్వానీ, అలియా భట్ లను కూడా సంప్రదించారట దర్శక నిర్మాతలు. కానీ వారి కాల్ షీట్లు అస్సలు ఖాళీ లేవని తెలుస్తుంది. పైగా ‘ప్రభాస్ 21’ కోసం 2 ఏళ్ళ వరకూ కాల్షీట్లు ఇవ్వాలి. కాబట్టి వారు చెప్పారట. దాంతో చేసేదేమీ లేక.. దీపిక పెట్టిన కండిషన్ కు దర్శక నిర్మాతలు దిగొచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు ఈమె కన్ఫార్మ్ అయిపోయిందని టాక్ నడుస్తుంది. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.