తన స్నేహితుడి పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ప్రభాస్..!

కెరీర్ ప్రారంభంలో హీరోగా ‘తొలివలపు’ సినిమా చేసినప్పటికీ.. ఆ తరువాత కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల విలన్ గా చేశాడు గోపీచంద్. ఆ తరువాత మళ్ళీ హీరోగా కొనసాగాడు. యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పించాడు. కానీ రొటీన్ కథలు ఎంచుకోవడం… కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వడంతో గోపీచంద్ రేస్ లో వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇక తరువాత ‘లౌక్యం’ సినిమాతో హిట్టు కొట్టినా ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు. ఇక ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాలన్నీ ప్లాపులే..! ఈ క్రమంలో ఎంతో కష్టపడి ‘చాణక్య’ చేసాడు. ఇది కూడా ‘సైరా’ దెబ్బకి ప్లాప్ గా మిగిలింది.

prabhas-with-gopichand

దీంతో అప్సెట్ అయిన గోపీచంద్ తన స్నేహితుడు ప్రభాస్ వద్దకు వెళ్ళాడట. గోపీచంద్ ను ఓదార్చిన ప్రభాస్.. తరువాత సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పాడట. అంతేకాదు ‘యూవీ.క్రియేషన్స్’ వారికి కూడా గోపీచంద్ కు సరిపడే కథ చూడమని చెప్పాడట. ఇప్పుడు గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత సుబ్రహ్మణ్యం అనే తమిళ దర్శకుడుతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి పూర్తయ్యాక పూర్తిగా గోపి.. ప్రభాస్ కంట్రోల్ ఉంటాడన్నమాట..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.