ఫ్యాన్స్ ను మళ్ళీ టెన్షన్ పెడుతున్న ప్రభాస్.. కారణం?

అసలే ‘ప్రభాస్20’ కి సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వట్లేదు అని ఫ్యాన్స్ నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారి పై చాలా కోపంగా ఉన్నారు. ‘#banUVCreations’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేసి మరీ వాళ్ళను ట్రోల్ చేసారు. అయినప్పటికీ నిర్మాతలు ఏమీ దిగిరాలేదనుకోండి..! ‘భవిష్యత్తులో ‘యూవీ క్రియేషన్స్’ వారితో సినిమాలు మాత్రం చెయ్యొద్దు’ అంటూ ప్రభాస్ కు రిక్వెస్ట్ పెట్టుకుని ఆ ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ప్రభాస్ కు .. ‘యూవీ’ హోమ్ బ్యానర్ లాంటిది.

‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ అయిన తరువాత ‘యూవీ’ వారికి ‘సాహో’ చేసాడు ప్రభాస్. అది కూడా పారితోషికం లేకుండా చేసాడు. అలాంటి ప్రభాస్ ‘యూవీ’ వాళ్లకు సినిమా చెయ్యకుండా ఉంటాడా? అసలే వాళ్ళు ప్రభాస్ కు ప్రాణ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్'(ప్రభాస్ 20 వర్కింగ్ టైటిల్) పూర్తయ్యాక.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు ప్రభాస్. సైన్స్ ఫిక్షనల్ మూవీగా దీనిని తీర్చిదిద్దనున్నాడు నాగ్ అశ్విన్. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ 350కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

Prabhas Fans Fires on Prabhas20 Movie Producers1

అయితే ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో మరో సినిమా చెయ్యడానికి ప్రభాస్ సైన్ చేసాడట. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు అని సమాచారం. ఒకవేళ బాలీవుడ్ డైరెక్టర్ కనుక మిస్ అయితే సందీప్ రెడ్డి వంగా.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రఖ్యాత టి.సిరీస్ వారు కూడా ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ‘యూవీ క్రియేషన్స్’ లో మరో సినిమా ప్రభాస్ చేస్తున్నాడు అని వార్తలు వచ్చిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ కు మళ్ళీ టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.