సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ కొత్త లుక్!

ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు, భీభత్సమైన స్టార్ డమ్, యావత్ ఇండియాలో ఎవరికీ లేని ఫ్యాన్ బేస్ ఇలా బోలెడు సంపాదించుకున్నాడు. వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు ఎనౌన్స్ చేస్తూ, సినిమా షూటింగుల్లో మంచి బిజీ ఉన్నాడు ప్రభాస్. అయితే.. ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరోను “మిర్చి” అనంతరం మళ్ళీ గ్లామరస్ గా చూడలేకపోతున్నామనే బాధ మాత్రం గట్టిగా ఉంది. “సాహో”లో లుక్ ఆల్మోస్ట్ సగానికిపైగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కలేదు.

ఆ తర్వాత “రాధేశ్యామ్” లుక్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. కనీసం “సలార్”లో అయినా బాగుంటాడు అనుకుంటే ప్రశాంత్ నీల్ ఏమో ప్రభాస్ ను తీసుకెళ్లి బొగ్గుల గనిలో పడేశాడు. అందువల్ల ప్రభాస్ మొహానికి అంటిన మసి తప్ప అక్కడేం కనిపించలేదు. ఎట్టకేలకు ఇవాళ “జాతిరత్నాలు” ట్రైలర్ లాంచ్ పుణ్యమా అని ప్రభాస్ కొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. మెండుగా మీసాలు పెంచి, జుట్టుతో ప్రభాస్ మళ్ళీ “బాహుబలి” లుక్ ను గుర్తుచేశాడు.

ఈ లుక్ “ఆది పురుష్” కోసమని తెలుస్తోంది. సొ, ఆదిపురుష్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు మనోడ్ని మళ్ళీ క్లీన్ షేవ్ లో చూడాలన్న ఆశ తీరబోతోంది అన్నమాట. ఇకపోతే.. ప్రభాస్ విడుదల చేసిన జాతిరత్నాలు ట్రైలర్ అదిరిపోయింది. మార్చి 11న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమాను నిర్మించనున్న స్వప్న సినిమాస్ నిర్మించడం విశేషం. దర్శకుడు అనుదీప్ కూడా నాగ్ అశ్విన్ క్లాస్ మెట్ మరి.


తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.