‘సర్కారు వారి పాట’ అనౌన్స్మెంట్ తో హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్..!

మహేష్ బాబు, ప్రభాస్.. ఇద్దరూ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలు. అంతేకాదు టాలీవుడ్ నెంబర్ వన్ రేసింగ్ హీరోలు కూడా..! వీళ్ళిద్దరికీ ఫ్యామిలీ ఆడియెన్స్ క్రేజ్ కూడా ఎక్కువే..! అయితే ‘ఈ స్టార్ హీరోలిద్దరూ వేగంగా సినిమాలు చెయ్యరు’ అనే కంప్లైంట్ ఎప్పటి నుండో ఉంది. ఈ మధ్య కాలంలో మహేష్ కొంచెం వేగంగా సినిమాలు చెయ్యకపోయినా.. చెయ్యడానికి మాత్రం ట్రై చేస్తున్నాడు. కానీ ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ మాత్రం.. రెండేళ్ళకు ఓ సినిమా అన్నట్టు చేస్తున్నాడు.

అవన్నీ పక్కన పెట్టినా.. ‘సాహో’ తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇప్పటికే 30శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. కానీ ఇంకా సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కనీసం టైటిల్ కూడా ప్రకటించలేదు నిర్మాతలు. అయితే మరోపక్క మహేష్ బాబు.. ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో సినిమా అనౌన్స్ చెయ్యడం.. దాని టైటిల్ తో కూడిన పోస్టర్ ను కూడా.. తండ్రి కృష్ణ పుట్టినరోజున విడుదల చేయించేసాడు.

Prabhas Fans vs Mahesh Babu Fans1

‘సర్కారు వారి పాట’ అనేది మహేష్ 27 వ చిత్రం టైటిల్. సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇలా.. కనీసం షూటింగ్ మొదలు పెట్టకపోయినా మహేష్ ఫ్యాన్స్.. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పండగ చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆ ఆనందం కూడా లేకపోవడంతో మళ్ళీ నిర్మాతల పై ఫైర్ అవుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా వారు అభిమానుల ముచ్చట తీరిస్తే బాగుణ్ణు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.