ఎన్టీఆర్ డైరెక్టర్స్ వేరే ఆప్షన్ చూసుకునేలా ఉన్నారే..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయ్యింది. బ్యాలన్స్ వర్క్ ను కూడా పూర్తి చేసి సినిమాని 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసాడు. అయితే కరోనా కారణంగా ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయ్యింది. ప్రస్తుతం భీమ్ టీజర్ కు ఏర్పాట్లు చేస్తున్నాడు. నవంబర్ నుండీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినా అది పూర్తవ్వడానికి మరో 7 లేదా 8 నెలలు టైం పడుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇవన్నీ కలిపి ఏడాది టైం పట్టినా ఆశ్చర్యం లేదు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్… త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలి అనుకున్నాడు. దాంతో పాటు కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా చెయ్యాలనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కోసం ఇప్పుడు ఆ దర్శకులు అంతకాలం ఎదురుచూసే అవకాశం కనిపించడం లేదు. ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ కోసం ఓ స్క్రిప్ట్ తయారుచేసుకున్నాడట. ప్రభాస్ 3 ప్రోజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ.. ప్రశాంత్ నీల్ కు ఓకే చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

మరోపక్క త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మహేష్ కూడా వెంటనే త్రివిక్రమ్ సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఈ ఇద్దరు దర్శకులు కనుక నెక్స్ట్ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటే.. ఎన్టీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో. అసలు ఈ డైరెక్టర్లు..ప్రభాస్, మహేష్ లతో ముందు సెట్స్ పైకి వెళ్ళలిగా..! అది తరువాతి సంగతి..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.