జాన్ మూవీ షూటింగ్ షురూ చేస్తున్న ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఫ్యాన్స్ ని వెయిట్ చేయించడం అలవాటైపోయింది. బాహుబలి ముందు వరకు ఏడాదికి ఒకటి నుండి రెండు చిత్రాలు చేస్తూ వచ్చిన ప్రభాస్ తర్వాత వేగం తగ్గించారు. ఐదేళ్లు బాహుబలి, బాహుబలి2 చిత్రాలకు కేటాయించిన ప్రభాస్, ఆతరువాత వేగంగా సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కి మాటిచ్చారు. కాని సాహో అనే మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి కమిటై మరో రెండేళ్లు దానికే కేటాయించారు. ఈవిధంగా 2013లో వచ్చిన మిర్చి సినిమా తరువాత, ఏడేళ్లలో ఆయన చేసింది కేవలం మూడు సినిమాలు. ఇక నేడు ఆయన తన 20వ మూవీగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

Prabhas Still From Prabhas20

డైరెక్టర్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 20-30 శాతం పూర్తయింది. సాహో విడుదల తరువాత ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ కి డుమ్మా కొట్టారు. అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ ఆలస్యం చేస్తూ వచ్చారు. కాగా త్వరలో జాన్(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ తిరిగి మొదలుపెట్టనున్నారట. యూరప్ నేపథ్యంలో నడిచే1960ల నాటి పీరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఇటలీలో చిత్రీకరించనున్నారని సమాచారం. ఆ షూటింగ్ లొకేషన్ కి సంబందించిన ఫోటో ప్రభాస్ పంచుకున్నారు. పురాతన కాలానికి చెందిన విలాసవంతమైన భవనంలో ఓ పాతకాలపు అందమైన పియానో, గోడలపై అనేక ఫోటోలు ఉన్న లొకేషన్ ఎంతో అందంగా ఉంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.