రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ మూవీ.. థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

రాజ్ తరుణ్, హేమల్ హీరో హీరోయిన్లుగా విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘పవర్ ప్లే’. మహిధర్,దివేశ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న విడుదల కాబోతుంది. పూర్ణ, ప్రిన్స్, కోటా శ్రీనివాసరావు, అజయ్, పూజా రామచంద్రన్ వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ లవ్ స్టోరీలు మాత్రమే చేసే డైరెక్టర్ మరియు హీరో ఈసారి కంప్లీట్ గా ఓ థ్రిల్లర్ సినిమా చేస్తుండడం బాగానే ఉంది కానీ.. ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడమే మైనస్ పాయింట్ చెప్పాలి. గతేడాది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ఓటిటిలో విడుదలయ్యి విజయం సాధించింది. దాంతో ‘పవర్ ప్లే’ పై కూడా అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :

నైజాం  0.60 cr
సీడెడ్  0.20 cr
ఉత్తరాంధ్ర  1.00 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  1.80 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  1.90 cr

‘పవర్ ప్లే’ చిత్రానికి రూ.1.9 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 2.1 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అసలు ఎప్పుడు షూటింగ్ మొదలైందో.. ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో అని ప్రేక్షకులు ఈ చిత్రం గురించి ఆలోచిస్తున్నారు. అంటే ప్రమోషన్స్ పెద్దగా జరగలేదని స్పష్టమవుతుంది. మరి అలాంటప్పుడు రూ.2.1 కోట్ల షేర్ ను రాబట్టి.. ఈ చిత్రం హిట్ లిస్ట్ లో చేరుతుందా అనేది పెద్ద ప్రశ్న. చూద్దాం..!

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.