మారేడుమల్లి అడవుల్లో చరణ్-పూజల రొమాన్స్

“రంగస్థలం”లో జిల్ జిల్ జిగేలు రాజా అంటూ చరణ్ సరసన స్టెప్పులేసిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఆచార్యలో “సిద్ధ”డికి జంటగా నటించనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ పాత్ర కోసం కీయారా అద్వానీ, సమంతల పేర్లు వినిపించినప్పటికీ.. పూజను ఫైనల్ చేశారు. చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా, చరణ్ సరసన పూజ కనిపించనుండడం విశేషం. ప్రస్తుతం మారేడుమల్లి అడవిలో జరుగుతున్న షెడ్యూల్లో పూజా హెగ్డే జాయిన్ అయ్యింది. చిరంజీవి-చరణ్-పూజా హెగ్డే కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.

ఇవి కాకుండా చరణ్-పూజ కాంబినేషన్ లో ఇంకొన్ని సన్నివేశాలు కూడా అక్కడే షూట్ చేసి, హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేయనున్న ప్రత్యేకమైన సెట్ లో చరణ్-పూజ నడుమ ఓ క్రేజీ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇకపోతే.. ఆల్రెడీ రికార్డ్ ధరకు అమ్ముడవుతున్న “ఆచార్య” రైట్స్ సినిమాపై అంచనాలను రోజురోజుకూ పెంచేస్తుంటే.. దర్శకుడు కొరటాల శివ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు ప్రతి సన్నివేశాన్ని చక్కగా చెక్కుతున్నాడని తెలుస్తోంది.

సోనూసూద్ మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి-చరణ్ కాంబినేషన్ సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్స్ & కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రొజెక్ట్ బడ్జెట్ ఇప్పటికీ 150 కోట్లు దాటిపోయిందని తెలుస్తోంది. మరి సినిమా నిర్మాతలకు ప్రాఫిట్స్ తెచ్చే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టగలదా లేదా అనేది చర్చనీయాంశం అయ్యింది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.