మళ్ళీ అక్షయ్ కుమార్ సినిమా ఒప్పుకున్న బుట్ట బొమ్మ

తమిళనాట పరిచయ చిత్రమైన “మాస్క్”, తెలుగులో పరిచయ చిత్రమైన “ఒకలైలా కోసం”, బాలీవుడ్ పరిచయ చిత్రమైన “మొహెన్ జొదారో” డిజాస్టర్లుగా నిలిచినప్పటికీ.. “దువ్వాడ జగన్నాధం” చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పుకొన్న పూజా హెగ్డే తెలుగులో “అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో” చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయిక హోదాను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో మళ్ళీ తన అదృష్టం పరీక్షించుకొనేందుకు సన్నద్ధమవుతోంది.

Pooja Hegde latest photoshoot still

ఆమె నటించిన మునుపటి హిందీ చిత్రం “హౌస్ ఫుల్ 4″కి కనీస స్థాయి రివ్యూలు రాకపోయినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మేసింది. మరి టాలీవుడ్ లో అమ్మడు స్టార్ డమ్ చూసో లేక గ్లామర్ షోకి నో చెప్పని అమ్మడి డేరింగ్ చూసో తెలియదు కానీ.. బాలీవుడ్ నుండి పూజా హెగ్డేకి మరో ఆఫర్ వచ్చింది. అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న ఓ భారీ బడ్జెట్ సినిమా కోసం సెకండ్ హీరోయిన్ గా పూజను ఫైనల్ చేశారట. ఈ సినిమాకి రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే వస్తోందట అమ్మడికి. ఈ ఏడాది తమిళ డెబ్యు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పూజా ఈ ఊపులో అక్కడ కూడా విజయపు జెండా పాతేస్తుందేమో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.