అలా మ‌రోసారి బుక్ అయిన పూజా‌..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న క‌న్న‌డ భామ‌ పూజా హెగ్డే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పలు భాష‌ల్లో సినిమాలు చేసినా, పూజా హెగ్డేకు బ్రేక్ ఇచ్చింది మాత్రం టాలీవుడ్ అని చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ప్లాప్స్ ప‌ల‌క‌రించినా, త‌న‌దైన అంద‌చందాలుతో ముఖ్యంగా చెప్పాలంటే, త‌న న‌డుము ఒంపుల‌తోనే ప్రేక్ష‌కుల్ని మైమ‌ర‌పిస్తూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇటీవ‌ల పూజా హెగ్డే మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్ష‌కుల్ని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసింది.

సౌత్‌లో న‌డుము, థైస్ చూపిస్తే చాల‌ని, అక్క‌డ హీరోయిన్స్ పెద్ద‌గా న‌టించాల్సిన ప‌ని లేద‌ని కామెంట్స్ చేయ‌గా, ప్రేక్ష‌కుల నుండి ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో, ఆ డ్యామేజ్ క‌వ‌రింగ్ చేయ‌డాని, క్ష‌మాప‌ణ‌లు చెప్పి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మ‌రోసారి ఆమె చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే రీసెంట్‌గా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో త‌న కెమిస్ట్రీ అదిరిపోతుంద‌ని, త‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్‌కి తార‌క్ ఎనర్జీ లెవ‌ల్స్ క‌రెక్ట్‌గా సెట్ అవుతోంద‌ని, అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రంలో ఎన్టీఆర్‌తో న‌టించ‌డం మంచి అనుభూతిని ఇచ్చింద‌ని, ఆ చిత్రంలో తొలిసారి డ‌బ్బింగ్ చెప్పాన‌ని, త‌న కెరీర్‌లో ఆ చిత్రానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌ని, అంతే కాకుండాత‌న‌కు న‌చ్చిన హీరో ఎన్టీఆర్ అని తేల్చి చెప్పింది.

దీంతో పూజా వ్యాఖ్య‌లు పై బ‌న్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో గుస్సా అవుతున్నారు. ఎలాంటి ఇమేజ్ లేక ప్లాప్స్‌లో ఉన్న టైమ్‌లో అల్లు అర్జున్‌తో తొలిసారి న‌టించి డీజే మూవీతోనే పూజాకు ఒక్క‌సారిగా క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌రోసారి బ‌న్నీతో చేసిన‌ అల వెకుంఠ‌పుర‌ములో చిత్రంతో కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ‌దీంతో నాడు ప్లాప్ హీరోయిన్‌గా ముద్ర ప‌డిన పూజాకు బ్రేక్‌తో పాటు, బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బ‌న్నీ పేరుచెప్ప‌కుండా, ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్త‌డంతో, బ‌న్నీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో పూజా హెగ్డేను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ఇటీవ‌ల అన‌వ‌స‌రంగా వివాదాలు కొని తెచ్చుకుంటున్న పూజా తాజా డ్యామేజ్‌ను ఎలా క‌వ‌ర్ చేస్తుందో చూడాలి.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Share.