మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన పూజా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజా హెగ్దే. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించేసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తోంది. మీడియం రేంజ్ హీరోలైన నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి హీరోల సరసన కూడా నటించేసింది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ హిట్లు ఈమె అకౌంట్ లు పడటంతో టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు ఈమెనే సంప్రదిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుండీ కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

pawan kalyan pooja hegde

ఈ క్రమంలో బోనీకపూర్… అజిత్ తో నిర్మించబోయే సినిమా కోసం పూజా హెగ్దే తో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు బోనీకపూర్ .. అజిత్ హీరోగా ‘వలిమై’ అనే సినిమాను నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉండగా… పవన్ రీ-ఎంట్రీ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా పూజా హెగ్దే ని సంప్రదిస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక ఫైనల్ అయితే ఈమె టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతోనూ నటించేసినట్టే..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.