నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న పూజా హెగ్డే..?

ఈ మధ్య కాలంలో తెలుగులో పూజా హెగ్డే నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళంతో పాటు హిందీ సినిమాల ఆఫర్లతో బిజీగా ఉన్నారు. తెలుగులో పూజా హెగ్డే నటిస్తున్న ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తరువాత సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైనట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం పూజా హెగ్డే డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఆ సినిమా ప్రొడ్యూసర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాలను సైతం అవాక్కయ్యేలా చేసింది. విజయ్ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా పూజా హెగ్డేకు గుర్తింపు ఉండటంతో మూడున్నర కోట్లు ఇవ్వడానికి ఆ సినిమా నిర్మాతలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమాలో నటిస్తున్నారు.

విజయ్ 65వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా పేరు వినిపించగా రష్మిక ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం నిర్మాతలు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మూడున్నర కోట్లు డిమాండ్ చేయడంలో తప్పేం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలకు పూజా హెగ్డే భారీ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ చుక్కలు చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.