తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ హిందీలో మంచి సక్సెస్ అందుకుంది. దీంతో తెలుగులో దీన్ని రీమేక్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ చాలాకాలం క్రితం అనౌన్స్ చేసింది. ఇన్నాళ్లకు ఈ వెబ్ సినిమాకి మోక్షం కలుగుతోంది. తెలుగులో ‘పిట్ట కథలు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సినిమాను రూపొందించారు. తాజాగా దీని టీజర్ ను రిలీజ్ చేశారు. నలుగురు మహిళల జీవితాల్లోని ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం వంటి భావోద్వేగాలను టీజర్ లో చూపించారు.

చాలా బోల్డ్ గా తెరకెక్కించారు. టీజర్ లో కొన్ని అడల్ట్ సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి లాంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వెబ్ సినిమాను రూపొందించారు. బ్యాక్ గ్రౌండ్ స్క్రొయే టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, అమలా పాల్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలానే అషిమా నార్వాల్, జగపతి బాబు, సత్య దేవ్, శాన్వి మేఘన లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమాను ఫిబ్రవరి 19న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి తెలుగులో ఈ వెబ్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.