స్లిమ్ గా మారిన పాయల్.. అసలు కారణమిదే!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు. సినిమాల్లో పాత్రలను బట్టి తమ శరీర బరువు ఉండేలా చూసుకుంటారు. అయితే హీరోయిన్ పాయల్ సడెన్ గా బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగు రోజుల క్రితం పాయల్ పెట్టిన స్లిమ్ ఫిజిక్ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. నెల రోజుల్లో ఐదు కిలోలు తగ్గి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంటే అమ్మడు ఎంత బాగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే అసలు బరువు తగ్గడానికి కారణాలేంటో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. కేవలం ఓ క్యురేటర్ కోసమే కష్టపడి ఐదు కిలోలు తగ్గినట్లు తెలిపింది. ఓ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని.. ఆ సినిమా కోసమే బరువు తగ్గానని చెప్పారు. సినిమాలో తనది పేదరికంలో బతికే అమ్మాయి పాత్ర అని.. ఒక పాత్ర కోసం బరువు తగ్గడం ఇదే మొదటిసారి అంటూ తన వెయిట్ లాస్ వెనుక కారణాలను బయటపెట్టింది.

తక్కువ సమయంలో ఎలా బరువు తగ్గిందో కూడా చెప్పుకొచ్చింది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8 గంటల మధ్య మాత్రమే ఆహారం తీసుకునేదట పాయల్. దీంతో పాటు వారంలో కొన్నిరోజులు ఉపవాసం కూడా చేసేదట. వీటితో పాటు యోగా, వ్యాయామం చేసి.. ముప్పై రోజుల్లో 63 కిలోల నుండి 58 కిలోలకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.