‘వకీల్ సాబ్’ టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలను సైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయన పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి టీజర్ కానీ ట్రైలర్ కానీ రాలేదు. ఒక్క మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఊరుకున్నారు మేకర్స్. దసరా నాడు టీజర్ వస్తుందని చాలా మంది ఊహించారు. చిత్రబృందం కూడా దసరా టార్గెట్ చేస్తూ టీజర్ వర్క్ మొదలుపెట్టారు. కానీ ఎందుకో టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.

దసరా బదులు దీపావళికి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. టీజర్ తోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనేది దర్శకనిర్మాతల ఆలోచన. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని నిర్మాత దిల్ రాజు పై చాలా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ తో ఈ విషయమై చర్చిస్తున్నారట. రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలంటే ముందు పవన్ సినిమా సెట్స్ పైకి రావాలి.

కానీ ఇప్పటివరకు అది జరగలేదు. త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొని.. డిసెంబర్ రెండో వారానికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అనుకున్న సమయానికి సినిమా పూర్తయితే.. సంక్రాంతి బరిలోకి ‘వకీల్ సాబ్’ని దింపాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అప్పటికి థియేటర్లన్నీ ఓపెన్ అవ్వాలి.. జనాలు థియేటర్లకు అలవాటు పడాలి. ఇలా చాలా ఉన్నాయి. అన్నీ లెక్కలేసుకున్న మేకర్లు ఒక్కసారి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే.. టీజర్ తోనే సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నారు. అందుకే టీజర్ రిలీజ్ విషయంలో ఆలస్యం జరుగుతోందని సమాచారం.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.