‘వకీల్ సాబ్’ కు ఇంకా అంత టైం పడుతుందా?

అసలు ఈ లాక్ డౌన్ ఏర్పడే పరిస్థితే కనుక రాకపోతే.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ ను చూసి 2 వారలు పైనే అయ్యుండేది. కానీ పవన్ అభిమానులు, ‘వకీల్ సాబ్’ టీం ఒకటి అనుకుంటే.. మరొకటయ్యింది.’ఎం.సి.ఎ’ ఫేమ్ వేణుశ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు,బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. అయితే మార్చి 3వ వారం నుండీ ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది కాబట్టి.. ఇంకా 20 శాతం మాత్రమే బ్యాలన్స్ ఉంది… అంటూ ప్రచారం జరిగింది.

ఇక ప్రభుత్వం షూటింగ్ లకు గనుక పర్మిషన్లు ఇస్తే.. మరో నెలరోజుల్లో సినిమా రెడీ అయిపోతుంది అనే డిస్కషన్లు కూడా నడిచాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదు అనేది తాజా సమాచారం. విషయం ఏంటంటే.. ‘వకీల్ సాబ్’ షూటింగ్ మరో 35 శాతం మిగిలుందట. కాబట్టి ఎంత కాదనుకున్నా.. మరో రెండు నెలలు టైం పడుతుంది అని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో నెల రోజులు అయినా టైం పట్టే అవకాశం ఉందట.

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

దీంతో దసరా వరకూ ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తొలిసారి పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. నివేదా థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ అయిన ‘మగువా మగువా’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.