‘జానీ’ సినిమాకి పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

ఒక్కసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలే కానీ.. ఒక్కో సినిమాకి 50 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.. యెస్.. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్. ఈయన ప్రస్తుతం రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్నాడు. ‘జనసేన’ పార్టీ ని బలోపేతం చేసి.. తన లక్ష్యాన్ని చేధించడానికి అహర్నిశలు పనిచేస్తున్నాడు. ఇక టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Pawan Kalyan's Johnny Movie

అయితే 2003లో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘జానీ’ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించగా.. మొదటి సారి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేసాడు. అప్పటి రోజుల్లోనే ఈ చిత్రానికి పవన్ 2.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పడం విశేషం. పవన్ పాల్గొన్న ఓ మీటింగ్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు పవన్. ‘జానీ చిత్రానికి అప్పటి రోజుల్లోనే నేను 2.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాను. ఆ డబ్బుతో అప్పట్లో మాదాపూర్ లో 30 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పుడు నాకు వేలకోట్ల ఆస్తులు ఉండేవి’ అంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ఏమైనా 16 ఏళ్ళ క్రితమే.. అది కూడా ఓ ప్లాప్ సినిమాకే అంత రెమ్యునరేషన్ అందుకున్నాడు అంటే.. పవన్ క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.