ఆఖరికి పవర్ స్టార్ ను పట్టాడా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పూరి జగన్నాథ్ ఈ కాంబినేషన్ అంటేనే చాలా స్పెషాలిటీ ఏర్పడుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక రెండో సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం కూడా పర్వాలేదు అనిపించినా వివాదాల వల్ల ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాల్ని తొలగించడం వంటివి సినిమా పై ఆసక్తిని చంపేసాయనే చెప్పాలి. దీంతో కమర్షియల్ గా ఆ చిత్రం వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ చిత్రంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి. ఇక అటు తరువాత ఒక్క ‘టెంపర్’ తప్ప పూరికి వరుస ప్లాప్ లు పడ్డాయి. ఆ క్రమంలో ‘జన గణ మన’ అనే కథని సిద్దం చేసుకుని మహేష్ వద్దకు వెళ్తే .. ఎందుకో మహేష్ ఓకే చెప్పలేదు. దీంతో హర్ట్ అయిన పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ టైం లో మహేష్ పై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసి వార్తల్లో నిలిచాడు.

Pawan Kalyan with Puri Jagannadh

దీంతో మహేష్ అభిమానులు పూరి ని ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. ఇది పక్కన పెడితే ‘జన గణ మన’ కథని తీసుకుని పూరి చాలా మంది హీరోల దగ్గరికి తిరిగాడు. ప్రభాస్, ‘కె.జి.ఎఫ్’ యష్, వంటి పాన్ ఇండియా స్టార్లను కూడా కలిసాడు. కాని ఎవ్వరూ ఓకే చెప్పలేదు. దీంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చాడు. ఇప్పుడు పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు … ‘పింక్’ రీమేక్ తో పాటు క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా… హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో పూరి చెప్పిన ‘జన గణ మన’ స్క్రిప్ట్ కు కూడా ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తుంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. పూరి తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పూరి టూరింగ్ టాకీస్’ లో ఈ చిత్రాన్ని స్వయంగా పూరినే నిర్మిస్తాడని తెలుస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.