వకీల్ సాబ్ ట్రైలర్ : పవన్ స్టైల్ పింక్ ఇది.. ఫ్యాన్స్ కోసం మాత్రం కాదు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ అయిన వకేల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు, బోని కపూర్ లు నిర్మాతలు. అక్కడ అమితాబ్ పోషించిన పాత్రను ఇక్కడ పవన్ పోషించాడు.ఇప్పటికే తమన్ సంగీతంలో రూపొందిన పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. దాంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ట్రైలర్ మొదలవ్వగానే పల్లవి(నివేదా థామస్) ను లాయర్ నంద(ప్రకాష్ రాజ్) ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడగడాన్ని మనం గమనించవచ్చు. ముగ్గురు అమ్మాయిలు ఏదో కేసులో చిక్కుకోవడం.. వారు తరుపున వాదించి.. వాళ్ళను నిర్దోషులుగా రుజువు చెయ్యడానికి నిలబడే లాయర్ గా పవన్ కనిపిస్తున్నాడు.

సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. పవన్ మేనరిజమ్స్ అభిమానులను అలరించే విధంగానే కనిపిస్తున్నాయి. కానీ ఈ కథకు వాళ్ళు ఎంత వరకూ కనెక్ట్ అవుతారు అనేది పెద్ద ప్రశ్న. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కు ప్లస్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ఓకె అనిపిస్తుంది మీరు కూడా ఓ లుక్కేయండి :


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.