తెలుగు హీరోల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ అభివృద్ధిని చేసే పనుల్లోనే బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ఆయన రాయలసీమలోని కొన్ని కీలక ఊర్లలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోల పై ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ‘తెలుగు సినిమాలో సాహిత్యం రానురాను దిగజారిపోతోంది. చాలా మంది తెలుగు హీరోలకు తెలుగు రాయటం, మాట్లాడటం రాదు.. అయినా.. తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు మాత్రం కావాలి’.. అంటూ మండిపడ్డాడు.

Pawan Kalyan with Mahesh Babu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ‘దీనిని వ్యతిరేకిస్తూ ఒక్క హీరో కూడా స్పందించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్. అయితే మిగిలిన హీరోల సంగతి ఏమో కానీ.. మహేష్ బాబు మాత్రం ‘నాకు తెలుగు మాట్లాడటం వచ్చు.. కానీ చదవడం.. రాయడం.. రాదని’ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ‘పవన్… మహేష్ ను ఉద్దేశించే ఈ సెటైర్ వేశాడా’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మహేష్ సినిమాలు కూడా భారీ వసూళ్ళు రాబడతాయి కాబట్టి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ‘తెలుగు సినిమాల నుండీ వచ్చే డబ్బులు మాత్రం కావలి’ అని పవన్ చెప్పిన డైలాగ్ కూడా దీనికి బాగా సింక్ అయ్యిందని చెబుతున్నారు.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.