సినిమా చేయాలంటే అలసటగా ఉంది: పవన్ కళ్యాణ్

పవన్ తను నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియోను మార్చి 20న రిలీజ్ చేస్తున్నాడు. దీనికోసం పోలీస్ సిబ్బందితో కలిసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ విషయాల గురించి పవన్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి విలేకర్లతో ముచ్చటించారు. ముందుగా పాసులు లేని వారు ఆడియో ఫంక్షన్ కి వచ్చి గుమ్మికూడోద్దని అలా చేయడం వలన అసాంఘిక శక్తులకు ఊతమిచ్చినట్లు అవుతుందని చెప్పారు. నొవెటల్ ఆడియో ఫంక్షన్ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన తెలంగాణా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అలానే పవన్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో తన అన్న చిరంజీవి చేతుల మీదుగా జరిగిందని ‘సర్దార్’ ఆడియో ఫంక్షన్ కు కూడా అన్నను ఆహ్వానించానని తెలిపారు. నిజానికి పవన్ కు ఇలా ఆడియో ఫంక్షన్స్ చేసుకోవడం నచ్చదట. కాని రాజకీయాలకైనా.. సినిమాలకైనా ఓ ట్రేడ్ విధానం ఉందని.. ఇష్టం ఉన్నా.. లేకపోయినా ఫాలో అవ్వాలని చెప్పారు. అలానే ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ కోసమే చేసానని.. పొలిటికల్ గా ఎలాంటి విషయాలను డీల్ చేయలేదని అన్నారు. పవన్ కళ్యాన్ ‘ఖుషి’ సినిమా తరువాత నాలుగైదు సినిమాలు చేసి మానేయాలనుకున్నారట. కాని కుదరలేదని పత్రికా ముఖంగా చెప్పారు. తనకు సినిమాలు చేయాలంటే అలసటగా ఉంటుందట. ఒకవేళ సినిమాలకు దూరమయినా.. తనకు కథలు రాసుకోవడమంటే ఇష్టమని రాయడం మాత్రం వదలనని చెప్పుకొచ్చారు.

Share.