మల్టీ స్టారర్ ను పక్కన పెట్టాడు.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్..!

ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. వచ్చే నెల నుండీ పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. నవంబర్ చివరాఖరికి ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసి 2021 సంక్రాంతి కానుకగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయ్యాక పవన్ క్రిష్ డైరెక్షన్లో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి..

పవన్ కళ్యాణ్ ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఆ మల్టీ స్టారర్ మరేదో కాదు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కొషియుమ్’. ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు తెలుగులోకి రీమేక్ చెయ్యనున్నారు. ఇప్పటికే రానా ఓ హీరోగా సెలెక్ట్ అయ్యాడు.మరో హీరోగా మొదట రవితేజ అన్నారు… ఆ తరువాత పవన్ కళ్యాణ్ పేరు వెలుగులోకి వచ్చింది. త్రివిక్రమ్ సలహాతో పవన్ ఈ రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యారని చాలా రోజులు టాక్ నడిచింది.

Three Pawan Kalyan fans no more of electric shock1

కానీ పవన్ మాత్రం ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడనేది తాజా సమాచారం. ‘వకీల్ సాబ్’ పూర్తయ్యాక.. పవన్ ఈ రీమేక్ లో నటించడానికి 4 నెలల వరకూ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందట. అలా అయితే క్రిష్ డైరెక్షన్లో చెయ్యాల్సిన మూవీ మరో 2నెలలు లేట్ అవుతుందని భావించి.. పవన్ ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.