పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఫిక్స్‌ అట

స్టార్‌ హీరో కొత్త సినిమా మొదలైందంటే… హీరోయిన్‌ ఎవరు అనేది ఫస్ట్‌ క్వశ్చన్‌ అయితే, సినిమా పేరేంటి అనేది రెండో క్వశ్చన్‌. ఇన్నాళ్లు అవుతున్నా ఈ ప్రశ్నలు మారడం లేదు. అయితే ఇది ప్రచారానికి ఉపయోగపడుతుండటంతో చిత్రబృందాలు కూడా నాన్చి నాన్చి తీరిగ్గా టైటిల్‌ చెబుతున్నాయి. తాజాగా పవన్‌ – క్రిష్‌ కాంబో సినిమా గురించి కూడా ఇదే జరుగుతోంది. హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్నకు నిధి అగర్వాల్‌ అనే సాలిడ్‌ ఆన్షర్‌ వచ్చేసింది. దీంతో సినిమా పేరు వార్తలు ట్రెండింగ్‌ అవుతున్నాయి.

పీరియాడికల్‌ డ్రామా కావడంతో ఈ సినిమాకు క్రిష్‌ అలాంటి వైవిధ్యమైన పేరే పెట్టాలని చూస్తున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. దాని కోసం హరి హర మహదేవ, వీరమల్లు విరూపాక్ష అంటూ చాలా పేర్లే వినిపించాయి. అయితే వేటి విషయంలోనూ చిత్రబృందం స్పందించలేదు. రాబిన్‌ హుడ్‌ స్టయిల్‌లో సినిమా ఉంటుందని కూడా వార్తలొచ్చాయి. దీంతో ఆ స్టయిల్‌లో ఏమన్నా పేరు ఆలోచిస్తారేమో అని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకో పేరు బయటకు వచ్చింది. ముందు వినిపించిన రెండు టైటిల్స్‌ను కలిపి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు పెడతారని వార్తలొస్తున్నాయి.

పవన్‌ – క్రిష్‌ సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌ విషయంలో సరైన సమాచారం ఉండటం లేదు. ఒకసారి మొదలైంది అంటున్నారు. ఈలోగా పవన్‌ ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ సెట్‌లో కనిపిస్తున్నాడు. అసలు షూటింగ్ అవుతోందా లేదా అనేది డౌట్‌. ఈ డౌట్‌ ముందు సినిమా టైటిల్‌ డౌట్‌ పెద్ద విషయం కాదు. అభిమానులైతే ముందు షూటింగ్‌ పూర్తి చేసేస్తే.. చాలు అనుకుంటున్నారు. పనిలోపనిగా సినిమా టైటిల్‌ కూడా చెప్పేయండి అంటున్నారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Share.